భూమి స్థలం మీద పెట్టుబడి పెట్టవచ్చా అది భవిష్యత్తులో లాభం ఉంటుందా?
- VGR Pavan
- Jul 12, 2023
- 2 min read
ఈరోజులలో భూమిపై పెట్టుబడులు అనేది ఒక కీలక విషయం ఎంత అంచనాలు వేసిన మనకి లాభం రావాలని లేకపోతే అవన్నీ వృధా ప్రయాసలే అవుతాయి కృష్ణమూర్తి గారి పద్ధతి కేపీ సిస్టం ఇలాంటి విషయాలకి ఒక చక్కటి దారి చూపిస్తుంది
భూమి మీద పెట్టుబడి పెట్టదలచిన ఒక వ్యక్తి వచ్చి నేను ఒక స్థలం కొనాలని అనుకుంటున్నాను కొనగలుగుతానా తద్వారా భవిష్యత్తులో లాభము పొందగలనా అని అడిగారు. నేను ఆయనప్రశ్న వేసిన సమయమునకు అనగా 9 జులై 2023, రాత్రి10. 25 18:25:15 జాతక చక్రమును వేశాను
..
కేపీ పద్ధతి సూత్రము
నాలుగవ స్థానం స్థిరాస్తులు కుజుడు భూమికి చంద్రుడు భవనాలకు కారకులు . నాలుగవ స్థానం సబ్ లార్డ్ కనుక నాలుగు 11 12 స్థానాలను సూచించిన ఒకరు సిరాస్తిని ఏర్పరచుకోగలుగుతారు ఆరవ స్థానం కూడా వచ్చిన అప్పు తీసుకుందురు .
లాభం గడించగలుగుతానా అన్న విషయానికి వస్తే ప్రస్తుతం నడుస్తున్న దశ గాని రాబోయే దశగాని రెండు ఆరు పది స్థానాలకు సబ్ ద్వారా కనెక్ట్ అయ్యి నాల్గవ స్థానానికి కూడా సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఆ దశలో భూమి ద్వారా లాభం పొందగలుగుతారు ఐదు ఎనిమిది 12 స్థానాలను సూచించిన దీనికి వ్యతిరేకమైన ఫలితాలను పొందుతారు .
జాతక విశ్లేషణ
ఇక్కడ నాలుగో సబ్-అధిపతి శని రాహు నక్షత్రమున బుదిని సబ్‌లో ఉన్నాడు . రాహువు గురువుతో కలిసి కలిసి మేషరాశిలో ఉన్నాడు అందువలన తాను ఉన్న రాశి అధిపతి, 12వ స్థానాధిపతి అయిన కుజుడు ఫలితాలను రాహువే ఇస్తాడు . ఇక బుధుడు గురు నక్షత్రమున రాహు సబ్‌లో ఉండి అనుకూలముగా ఉన్నాడు .
సూచన! : శని వక్ర గమనము వలన ఆలస్యం లేదా పనిలో పొరపాట్లు ఎదురవగలవు. బుధుడు 10వ స్థానాధిపతి గాన ఆ స్థలం అమ్ముటన్ని కూడా సూచిస్తుంది.
సూర్యుడు పుష్యమి నక్షత్రం చేరేవరకు జూలై 21 వరకు స్థలము తాలూకు వ్యవహారములు యందు జాప్యము లేదా రిజిస్ట్రేషన్ వాయిదా పడుట జరగవచ్చును.
ఆస్తి వలన లాభం గడించగలుగుతానా?
మహాదశకు నాలుగవ స్థానంతో పాటు 2, 6, 11 స్థానాలతో సంబంధం ఏర్పడిన నిశ్చయంగా లాభం చూడగలుగుతారు.
శని మహాదశ ఏప్రిల్ 2024తో ముగుస్తుంది . ఆపై బుధ దశ కాగా ఆయన గురు నక్షత్రమున రాహు సభలో ఉంది . గురువు నాల్గవ స్థానమున రాహు కేతు నక్షత్రంలో ఉండి ఆరు 10 మరియు 11 భావాలను సూచించారు .
కాబట్టి చక్కని లాభం బుధ దశ బుధ బుక్తి లోనే పొందుతారు . బుధుడు చరరాశిలో నాలుగో స్థానంలో ఉన్న గురు నక్షత్రం మీద రాహు సభలో ఉన్నాడు . బుధ దశ బుధ బుక్తి కేతు అంతర జరుగుతుండగా ఆగస్టు నుండి అక్టోబర్ 24 లో లాభం వస్తుంది . శని గురు నక్షత్రం లోకి ప్రవేశించినప్పుడు అనుకూలంగా ఉంటుంది
.జాతక ఫలితం
కేపీ పద్ధతి ప్రకారం ఆస్తి కొనుగోలు తరువాత మంచి ఆదాయం అక్టోబర్ 2024 లో పొందవచ్చు ఈ విధంగా నమ్మకంతో జాతక విశ్లేషణ చేయవచ్చు .
కృష్ణమూర్తి పద్ధతి ద్వారా జాతక ఫలితములను స్పష్టముగా మరియు సరళముగా తెలుసుకోవచ్చు. గురుదేవులకు వందనము. శుభమస్తు!
留言